Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

లారీ-బైక్‌ ఢీ.. యువకుడు దుర్మరణం

Pavan Chandragiri September 1, 2026

హాదేవపూర్‌, ఆంధ్రప్రభ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

లారీ, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహాదేవపూర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీని, కాటారం వైపు నుంచి మహాదేవపూర్‌ వస్తున్న బైక్‌ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటి అట్కరి (25) తీవ్రంగా గాయపడి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా గుమ్ములకొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News