Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

లింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

Nagamani Malligari August 4, 2026prabhanews.com

నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలి..

పాఠశాల మౌలిక వసతులపై ఆరా

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో అదనపు కలెక్టర్ పి.

చంద్రయ్య మంగళవారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణ పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ సహకారంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం గ్రామంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా కృషి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాగర్లమూడి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News