Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మాదిగ జాతిని అణగదొక్కే కుట్రలపై తిరుగుబాటు తప్పదు

Sowjanya Anneboina October 4, 2026prabhanews.com

  • స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పెద్దపెల్లి ఎంపీ నిర్లక్ష్యం
  • ఆసంపల్లి శ్రీనివాస్ మాదిగ మహాశక్తి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు

గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : మాదిగ జాతి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయని, వాటిని ప్రశ్నిస్తూ ఉద్యమం చేపడతామని తెలంగాణ మాదిగ మహాశక్తి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఆసంపల్లి శ్రీనివాస్ (వాసు) అన్నారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రెస్‌క్లబ్ భవనంలో మాదిగ మహాశక్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసంపల్లి శ్రీనివాస్ మాదిగ జాతి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆరోపించారు. మాదిగల జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో, రాజకీయ పార్టీల ఎదుగుదలలో మాదిగలను అవసరానికి ఉపయోగించుకుని అనంతరం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

యువతకు ఉపాధి కల్పించాలి

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయంలో ఎంపీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆసంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాజకీయంగా ఈ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకులు పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ అంశంపై ఇకపై మౌనంగా ఉండబోమని, ప్రజా సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నిస్తామని తెలిపారు. మాదిగల సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాదిగ మహాశక్తి ప్రతినిధులు మడిపల్లి మల్లేష్, ఇంజపూరి పులేందర్, పెద్దల్లి ప్రకాష్, ఆసంపల్లి రవీందర్, ఇరుగు రాల భాగ్యలక్ష్మి, జనగామ స్వప్న, నాతరి ఆదిత్య, పల్లె ప్రశాంత్, సందీప్తో పాటు జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News