Nagamani Malligari September 2, 2026prabhanews.com
హామీలు మాత్రం గాలిలో కలిశాయి
టేకుమట్లలో 'హామీల బాకీ కార్డులు' పంపిణీ.. ఎన్నికల హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్
టేకుమట్ల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు టేకుమట్ల మండల కేంద్రంలో 'హామీల బాకీ కార్డులు' పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మహిళలకు నెలకు రూ.2,500, రైతు భరోసా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116తో పాటు తులం బంగారం, పెంచిన పింఛన్లు తదితర హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, సీనియర్ నాయకులు ఆది రఘు, బందెల నరేష్, పోతనవేన ఐలయ్య, పింగిలి వెంకటేశ్వరరెడ్డి, ఉద్దమారి మహేష్, మారం లింగారెడ్డి, నల్లబెల్లి రవీందర్, గజ్జి రమేష్, బొడ్డు సదానందం, నేరెళ్ల శ్రీనివాస్, పొన్నం చంద్రయ్య, గువ్వాడి లక్ష్మణ్, దొడ్ల కోటేశ్వర్, నర్సింగరావు, సాద మహేందర్, ఎల్లస్వామి, మాదారపు కుమారస్వామి, సముద్రాల మొండయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు మాట్ల శ్రీనివాస్, రాం దేవేందర్, ఎలావేన నర్సయ్య, చిమ్మన్నవేన శ్రీకాంత్, నాయకులు పోతనవేన అరుణ్‌కుమార్, బాపురావు, గోపాలు, తుమ్మల నాగరాజు, అన్నయ్య, సరోత్తం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
