Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
కొడిమ్యాల, ఆంధ్రప్రభ : మైనార్టీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే డా.
మేడిపల్లి సత్యం తెలిపారు. ఇందిరా మైనార్టీ మహిళా యోజన పథకం కింద కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రేష్మ, షాబాన బేగంలకు మంజూరైన రూ.50 వేల చొప్పున 100 శాతం సబ్సిడీ చెక్కులను ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోగురి భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
