Rama Rao September 2, 2026Telangana
దండేపల్లి, ఆంధ్రప్రభ: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండేపల్లి మండల అధ్యక్షుడిగా ఆవుల శ్రీనివాస్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మండలంలోని మెదరిపేట భారతి తీర్థయాత్ర ఫంక్షన్ హాల్‌లో బుధవారం తగరపు సత్యం మాదిగ అధ్యక్షతన నూతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచనల మేరకు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
నూతన కమిటీలో అధికార ప్రతినిధిగా నాతరి రమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా జిల్లపెల్లి వినయ్ మాదిగ, శాతరాజి వినోద్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కుశనపెల్లి చిన్నయ్య మాదిగ, శాతరాజి తిరుపతి మాదిగలను ఎన్నుకున్నారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న నూతన మండలాల జాతీయ మహాసభకు నూతన నాయకత్వం హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిప్పకూర్తి మల్లేష్ మాదిగ, శనిగారపు మురళీకృష్ణ మాదిగ, మల్యాల శ్రీనివాస్ మాదిగ, కొల్లూరి రమేష్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
