Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి

Madhav August 5, 2026

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి

ల్కతుర్తి, ఆంధ్రప్రభ మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని హన్మకొండ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం రోజున ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యలపై పోరాటం, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఇనుగాల వెంకట్రామిరెడ్డి సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News