Nagamani Malligari September 23, 2026prabhanews.com
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హెలికాప్టర్‌లో గడ్డిపల్లికి రాక
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గడ్డిపల్లి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గడ్డిపల్లిలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న మంత్రికి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
మంత్రి రాకతో హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో హోరెత్తాయి. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకున్న కార్యకర్తలు, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, ప్రముఖ నాయకులు త్రిపురం అంజన్‌రెడ్డి, సుందరి నాగేశ్వరరావు, కటకం రమేష్, శోభన్‌బాబు, గుండు రామాంజిగౌడ్, పరకాల పరమేష్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
