Nagamani Malligari September 1, 2026prabhanews.com
వర్ని, ఆంధ్రప్రభ: వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో తిమ్మాపూర్‌కు చెందిన భోగవల్లి రఘు మృతి చెందినట్లు ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
రఘు కొంతకాలంగా మతిస్థిమితం లేకపోవడంతో పాటు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లు వదిలి బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న రఘు.. బస్టాండ్ సమీపంలోని మురుగు కాలువలో పడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
