Bala Raju October 23, 2026prabhanews.com
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు
ఖమ్మం, ఆంధ్రప్రభ: వైద్యారోగ్య శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ 'మీ ప్రమాణం' ఫేషియల్ అటెండెన్స్ యాప్ ద్వారానే తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.రామారావు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పిహెచ్‌సి , యుపిహెచ్‌సి సిబ్బంది ఉదయం 9 గంటలకు ఇన్, సాయంత్రం 4 గంటలకు ఔట్ అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. జిల్లా కార్యాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హాజరు వేయాలని సూచించారు. వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలోని సిబ్బంది హాజరును నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఫేషియల్ అటెండెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
