Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Moradabad | నెయ్యి ట్రక్కు బోల్తా.

Bala Raju September 23, 2026Moradabad, prabhanews.com

Moradabad |నెయ్యి ట్రక్కు బోల్తా…

నెయ్యి కోసం జనం పరుగులు.. హైవేపై వింత దృశ్యం
బోల్తాపడ్డ ట్రక్కు నుంచి రోడ్డుపైకి నెయ్యి..

డబ్బాలు, బకెట్లతో తరలివచ్చిన ప్రజలు

Moradabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మొరాదాబాద్‌ హైవేపై ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నెయ్యి లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న భారీ మొత్తంలో దేశీ నెయ్యి రోడ్డుపైకి, సమీపంలోని డ్రెయినేజీల్లోకి పారిపోయింది. ట్రక్కు బోల్తా పడి నెయ్యి రోడ్డుపై ప్రవహిస్తోందన్న విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. కొందరు డబ్బాలు, మరికొందరు బకెట్లు, గిన్నెలు తీసుకుని వచ్చి రోడ్డుపై పారుతున్న నెయ్యిని సేకరించేందుకు ప్రయత్నించారు.

ఉచితంగా నెయ్యి దొరుకుతుందన్న ఉద్దేశంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై నెయ్యిని డబ్బాల్లో నింపుకుంటున్న ప్రజల తీరుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న ఈ అసాధారణ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News