Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మోత్కూర్ గీత కార్మిక సంఘం ఎన్నికల నోటిఫికేషన్

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

9 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు

మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ గీత కార్మిక సంఘం (టి-455/హెచ్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం స్థానిక సంఘం ఆవరణలో జిల్లా సహకార శాఖ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.

విజయ్‌కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా గీత కార్మికుల నాయకులకు నోటిఫికేషన్‌ పత్రాలను అందజేశారు. మొత్తం 9 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడు సాధారణ స్థానాలతో పాటు రెండు మహిళా స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఈ నెల 5, 7, 8 తేదీల్లో మూడు రోజులపాటు స్థానిక గీత కార్మిక సంఘం భవనంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులు ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు రూ.750 నామినేషన్‌ రుసుము చెల్లించాలని సూచించారు. ఈ నెల 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు.

అదే రోజు సాయంత్రం 5 గంటలకు తొమ్మిది నామినేషన్లు మాత్రమే వచ్చినట్లయితే ఏకగ్రీవ ఎన్నికను ప్రకటిస్తామని చెప్పారు. తొమ్మిది స్థానాలకు మించి నామినేషన్లు దాఖలైతే పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలెట్‌ పద్ధతిలో గీత కార్మిక సంఘం భవనంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు విజయ్‌కృష్ణ తెలిపారు. పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్‌, సభ్యత్వ జాబితాను స్థానిక మున్సిపల్‌ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News