Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Movie Release | వరుణ్‌ తేజ్‌, లోకేశ్‌ మధ్య ఆసక్తికర పోటీ

Bharath August 4, 2026prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున ఇద్దరు క్రేజీ దర్శకులు, నటుల సినిమాలు విడుదల కావడం సాధారణమే అయినా..

ఈసారి టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం ఇద్దరు "కనకరాజుల" పోటీ. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం కొరియన్‌ కనకరాజు, ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనకరాజు మొదటిసారి హీరోగా తెరకెక్కిస్తున్న డీసీ యూనివర్స్‌ సినిమా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

మెగా కుటుంబం నుంచి వచ్చిన వరుణ్‌ తేజ్‌ విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత చిత్రాలు ప్రేక్షకులకు మెప్పించకావడంతో.. ఈసారి హర్రర్‌ కామెడీ అండ్‌ యాక్షన్‌ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ద్వారా తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని వరుణ్‌ తేజ్‌ చూస్తున్నారు.

మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు లోకేశ్‌ కనకరాజు సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఆయన సృష్టించిన లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (LCU)కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీసీ. ఈ సినిమానికి సంబంధించిన ట్రైలర్‌, పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకి అరుణ్
మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల అవుతుంది.

బాక్సాఫీస్‌ వద్ద ఎవరి పైచేయి?

ఈ రెండు సినిమాలు ఆగష్టు 7, 2026న ఒకే రోజు విడుదల కానున్నాయి. ఒకవైపు వరుణ్‌ తేజ్‌ అభిమానుల అంచనాలు, మరోవైపు లోకేశ్‌ కనకరాజు బ్రాండ్‌.. ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్‌ పోరులో విజేతగా నిలిచేది ఎవరు? ఇద్దరు కనకరాజుల్లో ఎవరి సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News