Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మూడు దశాబ్దాల సేవకు గౌరవ డాక్టరేట్‌

Pavan Chandragiri August 29, 2026

  • పుదుచ్చేరి వేదికగా అభినవ సంతోష్‌కుమార్‌కు అంతర్జాతీయ స్థాయి సత్కారం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: ప్రజాసేవనే జీవిత ధ్యేయంగా భావించి మూడు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కేశెట్టి సంతోష్‌కుమార్‌ (అభినవ సంతోష్‌కుమార్‌)కు అరుదైన గౌరవం దక్కింది.

సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పుదుచ్చేరిలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. దీంతో ఇక నుంచి ఆయన పేరు ముందు 'డాక్టర్‌' చేరింది.

తాండూరు మండలానికి చెందిన సంతోష్‌కుమార్‌ అభినవ కల్చరల్‌ సోషల్‌ స్పోర్ట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మంచిర్యాల జిల్లా మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక సేవ, విద్య, క్రీడలు, వ్యవసాయ అభివృద్ధి వంటి రంగాల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించింది.

పుదుచ్చేరిలోని కంబన్‌ కలైయరంగం ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సామాజిక నాయకులు-దార్శనికుల సమ్మేళనం-2026లో సంతోష్‌కుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. యునైటెడ్‌ అమెరికన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ డైరెక్టర్‌, తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్‌ కె. వెంకటేశన్‌ అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్‌. శంపత్‌, ప్రపంచ శాంతి సంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి, ప్రపంచ బౌద్ధ సమాఖ్య అధ్యక్షుడు రాయబారి డాక్టర్‌ పర్విందర్‌ సింగ్‌, అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్‌ కావేటి శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ పి. అమృతవల్లి, భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జాతీయ కమిషనర్‌ డాక్టర్‌ కె. సుకుమార, చెన్నై మద్రాస్‌ హైకోర్టు గౌరవ మధ్యవర్తి డాక్టర్‌ ఎస్‌. సిద్ధార్థన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్న తన ప్రయాణానికి ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News