Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి నూతన ఆర్చి

Nagamani Malligari August 28, 2026prabhanews.com

రూ.10 లక్షలతో నిర్మించిన ఆర్చిని ప్రారంభించిన లక్ష్మణ్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆర్చి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

చౌటుప్పల్ మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు గోపగోని సుజాత జ్ఞాపకార్థం ఆమె భర్త, సీపీఎం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ రూ.10 లక్షల వ్యయంతో ఆర్చిని నిర్మించారు. గురువారం ఆయన స్వయంగా ఆర్చిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోపగోని లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేసిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యురాలిగా తన సతీమణి సుజాత ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆమె జ్ఞాపకార్థమే ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆర్చిని నిర్మించినట్లు తెలిపారు.

ఇదే క్రమంలో తన తండ్రి గోపగోని బుచ్చయ్య జ్ఞాపకార్థం బంగారిగడ్డ స్మశాన వాటిక ప్రాంగణంలో ఇల్లు లేని పేదల కోసం రెండు గదులు నిర్మిస్తానని లక్ష్మణ్ గౌడ్ హామీ ఇచ్చారు. కర్మకాండలు పూర్తయ్యే వరకు వారు నివాసం ఉండేలా ఈ గదులను ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో చౌటుప్పల్ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News