Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల నిరసన

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం జుక్కల్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

టీజీఈ జేఏసీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రెండో పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేసి, ఉద్యోగులకు ఆరోగ్య కార్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బి. శ్రీనివాస్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటియు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంబ్లే గోపాల్, జుక్కల్‌ మండల అధ్యక్షుడు కంబ్లే సాయిలు, టీపీయూఎస్‌ ఉపాధ్యాయ సంఘం జుక్కల్‌ మండల అధ్యక్షుడు జయ్‌చంద్, టీఎన్జీవో జుక్కల్‌ మండల అధ్యక్షుడు కంబ్లే నాగయ్య, జీపీఓ మండల సంఘం అధ్యక్షుడు సాయిలు పాల్గొన్నారు. ఎంపీడీవో బి. శ్రీనివాస్, ఎంపీఓ రాము, హిందీ ఉపాధ్యాయ ఫోరం అధ్యక్షుడు సాయిలు నిరసన కార్యక్రమానికి తమవంతు మద్దతు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News