Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal Flash Floods |నేపాల్‌ను మరోసారి ముంచెత్తనున్న జల ప్రళయం

Bharath August 28, 2026prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: నేపాల్‌లో మరోసారి భారీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

గత వరదల కంటే ఐదు రెట్ల తీవ్రతతో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మరో 20 నిమిషాల్లో వరద వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేపాల్‌లో ఇప్పటికే భారీ వరదలతో తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

నేపాల్‌ వరదలపై చైనా కీలక నిర్ణయం

నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో చైనా సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం సంభవించిన భారీ వరదల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ నీటి మడుగు (బ్యారేజ్‌ లేక్‌) ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి మడుగు ఒక్కసారిగా తెగిపోతే మరో భారీ విపత్తు సంభవించే ప్రమాదం ఉందన్న ఆందోళనతో చైనా రెస్క్యూ ఆపరేషన్లను నిలిపివేసింది. పరిస్థితిని అంచనా వేసిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

నేపాల్‌ సరిహద్దులో మరో ప్రకంపన.. చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. చైనా-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియలతో తీవ్ర పరిస్థితులు నెలకొన్న వేళ తాజా భూకంపం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సరిహద్దు ప్రాంతంలో ప్రకంపనల ప్రభావంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News