Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగం.. కేసులు నమోదు

Sowjanya Anneboina September 23, 2026prabhanews.com

దాశివనగర్, ఆంధ్రప్రభ : వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పోలీస్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సదాశివనగర్‌ ఎస్‌ఐ ఎం.

పుష్పరాజ్‌ తెలిపారు. మండల పరిధిలోని రెండు గ్రామాల్లో డీజేలు వినియోగించిన ఘటనలపై పోలీసులు చర్యలు చేపట్టారు.

వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టంగా తెలియజేసినప్పటికీ.. ధర్మారావుపేట, అమర్లబండ గ్రామాల్లో అనుమతులు లేకుండా డీజేలు వినియోగించినట్లు గుర్తించారు. దీంతో డీజేలను సీజ్‌ చేయడంతో పాటు డీజే ఆపరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాల నిర్వాహకులు (ఆర్గనైజర్లు), వారికి సహకరించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ప్రజలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు, నిమజ్జన కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు, ఇతర శబ్ద పరికరాలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News