Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nirmal-Adilabad-డివైడర్‌ను ఢీకొని దగ్ధమైన కారు

Ramakanth Vuriti November 14, 2026prabhanews.com

ట్రయల్‌ రన్‌ చేస్తుండగా ప్రమాదం.. మెకానిక్‌కు తీవ్ర గాయాలు

Nirmal-Adilabad- నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం మరమ్మతుల అనంతరం ట్రయల్‌ రన్‌ కోసం తీసుకెళ్లిన కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో మెకానిక్‌ రవి తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని నటరాజ్‌నగర్‌ కాలనీకి చెందిన రవి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మరమ్మతుల కోసం వచ్చిన వ్యాగనార్‌ కారుకు రిపేర్లు చేసిన అనంతరం ట్రయల్‌ రన్‌ కోసం సోఫీనగర్‌ వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా వాటి బారినపడింది.

ఈ ప్రమాదంలో రవికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన అతడు వెంటనే కారు నుంచి బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన రవిని 108 అంబులెన్స్‌లో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ సమ్మయ్య ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News