Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నిరుపేదలకు అండగా.. సామాజిక సేవలు ముమ్మరం

Sowjanya Anneboina August 31, 2026prabhanews.com

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బట్టపోతు రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని దామెర గ్రామ సర్పంచ్ సాతిరి శ్రీధర్ కొనియాడారు.

బట్టపోతు రాములు 6వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ మండల పరిధిలోని దామెర గ్రామంలో సోమవారం వాటర్ ప్లాంట్‌కు వారి కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించి, గ్రామానికి 200 వాటర్ క్యాన్లను అందజేశారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ… రాములు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ. 50వేలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారని తెలిపారు. నిరుపేదలకు, గ్రామానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ​

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పునూతల నరసింహ, రాములు కుటుంబ సభ్యులు బట్టపోతు కరుణ, విజయ్, విక్రమ్, వరుణ్, బట్టపోతు భిక్షం, సరిపల్లి మంజుల, పెరుమాళ్ళ అరవింద్, ఐతగోని నరసింహ, సాతిరి మధు, ఊడగు యాదయ్య, సాతిరి ధనరాజు, బట్టపోతు సత్తయ్య, ఊడగు రాఘవేంద్ర, ఏన్నం శ్రీనివాస్, బియ్య సత్యనారాయణ, సాతిరి రాజు, సాతిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News