Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిది

Sowjanya Anneboina August 23, 2026prabhanews.com

రూ.5 లక్షల ఎల్ఓసీ పత్రం అందించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బుద్ధనగర్‌కు చెందిన కాంబ్లె జయశ్రీకి గుండె శస్త్రచికిత్స అవసరమని తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాన్ని ఆదివారం ఉట్నూరులోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ నిరుపేదలకు ఖరీదైన వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా న్యాయం చేకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News