Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నోటీసులు అందిన వారు ఆందోళన చెందొద్దు..

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయపూర్ క్యాంపు గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ నోటీసులు అందుకున్న ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. తమకు కేటాయించిన విచారణ తేదీన గ్రామపంచాయతీ కార్యాలయానికి హాజరై సరైన ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు.

ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారు సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తహసీల్దార్ సూచించారు. విచారణ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా తమ వివరాలను పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News