Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

నోయిడా స్లీపర్‌ బస్సు ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్

Pavan Chandragiri September 1, 2026

  • ఢిల్లీ, నోయిడా అధికారులకు నోటీసులు
  • ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో
  • రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఆంధ్రప్రభ : కదులుతున్న స్లీపర్‌ బస్సులో 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ( ) తీవ్రంగా స్పందించింది.

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌.. సమగ్ర దర్యాప్తు చేపట్టి, తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ, గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ అధికారులను ఆదేశించింది.

బాధిత బాలికకు అందించిన వైద్య సాయం, పరిహారం, పునరావాస చర్యల వివరాలను కూడా యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌లో పొందుపరచాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా నుంచి ఢిల్లీ వెళ్తున్న మార్గంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మైన్పురికి చెందిన 16 ఏళ్ల బాలిక నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా.. భారీ వర్షం కారణంగా పరిచయం లేని ప్రాంతంలో దిగిపోయింది. అక్కడ ఖాళీగా ఉన్న స్లీపర్‌ బస్సును ఎక్కిన సమయంలో డ్రైవర్‌, కండక్టర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు నమోదైంది.

బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌లను అరెస్ట్‌ చేశారు. బస్సును కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

స్లీపర్‌ బస్సుల్లో భద్రతా నిబంధనల అమలుపైనా ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టి సారించింది. ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేసే విభజనలు, డ్రైవర్‌ క్యాబిన్ల విషయంలో గతంలోనే హెచ్చరికలు చేసినట్లు కమిషన్‌ పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News