Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

NTA డైరెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్.

Bala Raju August 28, 2026andhra pradesh, AP news, prabhanews.com

NTA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి.

ప్రసన్న వెంకటేశ్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర సిబ్బంది వ్యవస్థ పరిధిలో ఆయన ఐదేళ్లపాటు ఎన్‌టీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి ఇకపై ప్రసన్న వెంకటేశ్‌ నాయకత్వం వహించనున్నారు.

ప్రసన్న వెంకటేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టి అనుభవం సంపాదించిన ఆయనకు తాజాగా కేంద్ర పరిధిలోని అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ఎన్‌టీఏకు డైరెక్టర్‌గా అవకాశం దక్కింది.

దేశవ్యాప్తంగా నిర్వహించే పలు కీలక ప్రవేశ పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏది ప్రధాన పాత్ర. ఇలాంటి సంస్థకు ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News