నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ.

నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ.

ప్రభన్యూస్

ప్రభన్యూస్

17hr

Loading...

Nagamani Malligari April 7, 2026contractor

నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ…

ర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామం నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని బైరాపురం వరకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన రోడ్డును ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల్లో నాణ్యత పాటించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు…

అనంతరం ఎంపీ మాట్లాడుతూ పంచలింగాల నుంచి భైరపురం వరకు నిర్మిస్తున్న రహదారి ప్రధానంగా కర్నూలు జిల్లాను తెలంగాణలోని అలంపూర్ ప్రాంతంతో అనుసంధానిస్తుందన్నారు.. ఈ రోడ్డు వల్ల పంచలింగాల నుంచి అలంపూర్ వైపు వెళ్లే భక్తులకు మరియు స్థానిక వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు.. అంతే కాక ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగు పడతాయని ఆయన తెలిపారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News

Comments

2
Loading comments...