Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

న్యూ లైఫ్‌ బట్టల దుకాణాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

హబూబ్‌నగర్‌ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంపీసీ కాంప్లెక్స్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ మార్వానికి చెందిన న్యూ లైఫ్‌ బట్టల దుకాణాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు.

మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన దుకాణాన్ని ప్రారంభించి యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యమైన బట్టలను అందుబాటులో ఉంచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని దుకాణ యజమానికి సూచించారు.

వినియోగదారుల నమ్మకాన్ని పొందేలా వ్యాపారాన్ని కొనసాగించాలని అన్నారు. దుకాణ యజమాని సిరాజ్‌ మార్వాని మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక ధరలకు వస్త్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. రూ.వెయ్యికే నాలుగు చొక్కాలు, రూ.వెయ్యికే నాలుగు ప్యాంట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News