Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఓటరు సవరణకు ధ్రువీకరణ పత్రాల సమర్పణ

Rama Rao September 1, 2026Telangana

మునుగోడు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని రత్తిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ జిట్టగోని సైదమ్మ సైదులు ఆధ్వర్యంలో సమగ్ర ఓటరు సవరణ-2 కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లకు జారీ చేసిన ఆరు నోటీసులను పూర్తిగా పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం అవసరమైన సరైన ధ్రువీకరణ పత్రాలను మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వంశీకి అందజేశారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే సంబంధిత అధికారులకు ధ్రువీకరణ పత్రాలతో తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిట్టగోని మల్లేష్‌, బైకాని స్వామి, జీపీఓ సాగర్ల లింగయ్య, బీఎల్‌ఓ మంగమ్మ, గ్రామపెద్దలు, ఓటర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News