Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పాములను చంపొద్దు.. సంరక్షించండి!

Nagamani Malligari October 4, 2026prabhanews.com

వన్యప్రాణి వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : వన్యప్రాణి వారోత్సవాలు-2026లో భాగంగా అచ్చంపేట రాజీవ్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులకు పాముల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

స్నేక్‌ క్యాచర్‌ సుమన్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ హన్మంతు నాయక్‌ పాముల జాతులు, విషపూరిత, విషరహిత పాముల గుర్తింపు, పర్యావరణంలో వాటి ప్రాధాన్యాన్ని వివరించారు. పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇళ్లలోకి పాములు వస్తే వాటిని చంపకుండా దూరంగా ఉండి, శిక్షణ పొందిన స్నేక్‌ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

పాముకాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మవద్దని అవగాహన కల్పించారు. విషరహిత పాములను చిన్నారులు, పెద్దలతో పట్టించి వాటి గురించి అవగాహన కల్పించారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి రేవంత్‌ చంద్ర, ఐఎఫ్‌ఎస్‌ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఎల్‌.చందునాయక్‌, రమేష్‌ నాయక్‌, అడ్వకేట్‌ సుధాకర్‌, పట్టణ ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News