Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పాపన్న చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..

Sowjanya Anneboina August 21, 2026prabhanews.com

  • బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రముఖ న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): పాపన్న చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖ న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు.

తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బాక్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను డాక్టర్ కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని ఎం.ఎస్. క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో భాగంగా తేజ కాలేజీ, లా కాలేజీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు డాక్టర్ కృష్ణమూర్తి టాస్ వేసి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించి ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్, తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ, కార్యదర్శి చింతల సాయి కుమార్, ఎల్. వేణుగోపాల్, ప్రభాకర్ గౌడ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News