Sowjanya Anneboina August 24, 2026prabhanews.com
గాంధీ భవన్‌లో సచిన్ సవంత్‌తో తోపాజీ అనంతకిషన్ భేటీ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ అన్నారు.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సవంత్‌తో అనంతకిషన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఎస్‌ఐఆర్ తదితర అంశాలపై సచిన్ సవంత్ ఆరా తీసినట్లు అనంతకిషన్ తెలిపారు. ముఖాముఖి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, వాటిపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అప్పగించిన కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉందనే అంశాలను సచిన్ సవంత్ అడిగి తెలుసుకున్నట్లు అనంతకిషన్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరంపై చర్చించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం, ఇప్పటివరకు నిర్వహించిన వివిధ బాధ్యతలు, చేపట్టిన పదవులు, పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా సచిన్ సవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారని అనంతకిషన్ తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో తన పాత్ర, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
సచిన్ సవంత్ అడిగిన అన్ని అంశాలకు తాను స్పష్టంగా సమాధానాలు ఇచ్చినట్లు తోపాజీ అనంతకిషన్ వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలపై సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమావేశం సాగిందని అనంతకిషన్ పేర్కొన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించినట్లు అనంతకిషన్ చెప్పారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
