Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పదవీ విరమణ పొందిన ఎస్సైకి ఘన వీడ్కోలు

Nagamani Malligari September 1, 2026prabhanews.com

37 ఏళ్ల పోలీస్‌ సేవలకు అభినందనలు

చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై-3గా విధులు నిర్వర్తించిన ఈశ్వరయ్య మంగళవారం పదవీ విరమణ పొందారు.

ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. కార్యక్రమంలో చిట్యాల సీఐ వై.సతీష్‌, ఎస్సై పోచంపల్లి సతీష్‌ కలిసి ఈశ్వరయ్యను శాలువాతో సత్కరించారు. అనంతరం సీఐ సతీష్‌ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైన దశ అని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖలో 37 సంవత్సరాల పాటు నిబద్ధత, క్రమశిక్షణతో విశిష్ట సేవలందించిన ఈశ్వరయ్యను అభినందించారు.

ప్రజలకు, పోలీస్‌ శాఖకు సుదీర్ఘకాలం అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఈశ్వరయ్య ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News