Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పెద్దపోర్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

Sowjanya Anneboina August 30, 2026prabhanews.com

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం : సర్పంచ్ బోయిన్‌పల్లి కాశమ్మ

ట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సర్పంచ్ బోయిన్‌పల్లి కాశమ్మ తెలిపారు.

గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలోని 6, 7వ వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవి, వార్డు సభ్యురాలు కోళ్ల పద్మమ్మ సురేష్, మాజీ సర్పంచ్ కాశీమప్ప, మాస్ లైన్ పార్టీ నాయకులు కోల కృష్ణయ్య, కావాలి బాలప్ప, అంజప్ప, బొర్రా బాలప్ప, నర్సిములు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News