Bharath September 23, 2026prabhanews.com
పెద్దపల్లి జిల్లా ధర్మారం, ఆంధ్రప్రభ: పిడుగుపాటుకు ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మృతురాలి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలం చామనపల్లి గ్రామానికి చెందిన మారం అంజవ్వ (60) బుధవారం పత్తి చేనులో కలుపు తీసేందుకు గ్రామానికి చెందిన కూలీలతో కలిసి జూలపల్లి మండలం బాలరాజుపల్లికి వెళ్లింది.
మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులతో వర్షం ప్రారంభం కావడంతో కూలీలంతా సమీపంలోని చెట్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా.. పిడుగు పడింది. ఈ ఘటనలో అంజవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
