Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పోయిన సెల్‌ఫోన్‌ గుర్తించి బాధితుడికి అప్పగింత..

Sowjanya Anneboina August 30, 2026prabhanews.com

దండేపల్లి, ఆంధ్రప్రభ : పోయిన సెల్‌ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి బాధితుడికి అప్పగించారు దండేపల్లి పోలీసులు.

తళ్లపేట గ్రామానికి చెందిన కుడిమేత లక్ష్మణ్‌ గత నెల 10న అవసర నిమిత్తం తళ్లపేట వారసంతకు వెళ్లిన సమయంలో తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఈ విషయంపై దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి దరఖాస్తు చేసుకున్నాడు. ఫిర్యాదుపై స్పందించిన దండేపల్లి ఎస్సై జి. రాజ్యవర్ధన్‌ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అనంతరం ఆదివారం సెల్‌ఫోన్‌ను బాధితుడు లక్ష్మణ్‌కు అప్పగించారు. పోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించి తిరిగి బాధితుడికి అందించిన దండేపల్లి పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News