Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రజాపాలనలో అందరూ సుభిక్షం

Bala Raju September 23, 2026prabhanews.com

ప్రభుత్వ విప్ విజయరమణారావు

కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ: ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలంతా సుఖ సంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆదర్శ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఆదర్శ్ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. అనంతరం ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాను తీశారు. లక్కీ డ్రాలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌కు ఎలక్ట్రిక్ బైక్ రావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్యయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, ఉప సర్పంచ్ గోలి సుధాకర్ నాయకులు మాదాసి సతీష్, ఎండీ మునీర్, పాల రాజేశంలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News