Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రజల దాహార్తి తీర్చడమే ఆయన ధ్యేయం.

Sowjanya Anneboina August 31, 2026prabhanews.com

వర్షంలోనూ తెల్లవారుఝాము నుంచి గొడుగు పట్టుకుని…

కాలువ ప్రక్షాళన పనులను స్వయంగా పర్యవేక్షించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని..

కృష్ణా కెనాల్ టెయిల్ ఎండ్ ప్రజలకు తాగునీరు అందించేందుకు…
తెల్లవారుజాము నుంచే సీతంపేట వద్ద రంగంలోకి దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని..
జేసీబీలతో కాలువలోని కర్రనాచు, తుమ్మ చెట్లను తొలగిస్తూ నీటి ప్రవాహానికి మార్గం సుగమం
వర్షాన్ని సైతం లెక్కచేయక ప్రజల కోసం క్షేత్రస్థాయిలో నిలబడ్డ జననేతపై కూటమి నాయకులు, ప్రజల ప్రశంసల జల్లు.

ఏలూరు, ఆంధ్రప్రభ : దెందులూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే తన మొదటి ప్రాధాన్యత అని, ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ నిరూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా కెనాల్ ద్వారా ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసింది. కృష్ణా కెనాల్ చివరి ఆయకట్టు (టెయిల్ ఎండ్)లో ఉన్న దెందులూరు నియోజకవర్గానికి ఈ నీటిని చేరవేసేందుకు, ఏలూరు తూర్పులాకుల వద్ద నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి సీతంపేట హెడ్ ద్వారా దెందులూరు మండలానికి తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

తెల్లవారుజాము నుంచే సీతంపేట కెనాల్ వద్ద ఎమ్మెల్యే చింతమనేని కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా వేగంగా నీరు దెందులూరు చేరుకోవాలనే సంకల్పంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరకు సీతంపేట కెనాల్ వద్ద ప్రక్షాళన పనులు చేపట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే కురుస్తున్న కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా సీతంపేట కెనాల్ వద్దకు చేరుకున్నారు. వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి, జేసీబీ యంత్రాల సహాయంతో కాలువలో పేరుకుపోయిన గుర్రపునాచు, కర్రనాచు మరియు అడ్డుగా ఉన్న తుమ్మ చెట్లను తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చకచకా పనులు పూర్తయ్యేలా సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

వెల్లువెత్తిన ప్రశంసలు…

తమ నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది రాకూడదనే ఏకైక లక్ష్యంతో, వర్షంలో సైతం తడుస్తూ తెల్లవారుజాము నుంచే కాలువ గట్టుపై నిలబడి పనులను పరుగులు తీయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పనితీరు, నాయకత్వ పటిమపై కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, రైతాంగం ప్రశంసల జల్లు కురిపించారు. "కష్టమొచ్చినా, వర్షమొచ్చినా ప్రజల కోసం క్షేత్రస్థాయిలోనే ఉండే నిజమైన ప్రజా సేవకుడు మన చింతమనేని అన్న" అని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News