Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్‌

Nagamani Malligari September 2, 2026prabhanews.com

పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రాత్మక పథకాలు.. నర్సంపేటలో ఘనంగా 17వ వర్ధంతి

నర్సంపేట, ఆంధ్రప్రభ : దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని నర్సంపేటలో వైఎస్సార్‌ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్సార్‌ స్మారక గార్డెన్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్‌ నాడెం శాంతికుమార్‌ మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేశారని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలు కోట్లాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు.

'ప్రజలే నా కుటుంబం' అనే భావనతో పాలన సాగించిన వైఎస్సార్‌.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో 'మహానేత'గా చిరస్థాయిగా నిలిచిపోయారని శాంతికుమార్‌ అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల ఆదరాభిమానాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ అభిమానులు గిరగాని చంద్రమౌళి, జిల్లేపల్లి దినేష్‌, మాదాసి శోభ, ఖాజాబీ, నాడెం నాగేశ్వర్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌, రాజు, యుగంధర్‌, రాజేందర్‌, కట్టయ్య, శివ, ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News