Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రతి ఓటు హక్కు అత్యంత విలువైనది..

Sowjanya Anneboina August 23, 2026prabhanews.com

మంథని టౌన్, ఆంధ్రప్రభ : ప్రతి ఓటు హక్కును కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అన్నారు.

ఆదివారం మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లకు సర్ ఫేజ్-2 ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, జాబితాలో తప్పులు ఉంటే వెంటనే గుర్తించి సంబంధిత ఓటరుకు సమాచారం అందించాలని సూచించారు.

అవసరమైన మార్పులను గుర్తించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల బాధ్యతలను తెరపై ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రతి ఓటరు హక్కును పరిరక్షించే బాధ్యత ఏజెంట్లపై ఉందని గుర్తుచేశారు. నాయకులు, కార్యకర్తలు ఏజెంట్లతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడుదల వెంకన్న, వైనాల రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News