Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు నగదు బహుమతులు

Rama Rao September 1, 2026Telangana

దువులో ముందడుగు.. ప్రోత్సాహంలో మరో అడుగు
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు మేడపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు.

పాఠశాల, మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి ప్రోత్సహించారు. మేడపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో గుగ్గిళ్ల తిరుపతికి ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, అభిరామ్‌కు ద్వితీయ బహుమతిగా రూ.5 వేల నగదు అందజేశారు. అదేవిధంగా నల్లబెల్లి మండల స్థాయిలో కందగట్ల మనస్వినికి ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, గుగ్గిళ్ల తిరుపతికి ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు అందించారు. 'చదువులో ముందడుగు..

ప్రోత్సాహంలో మరో అడుగు' అనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ఇతర విద్యార్థులకు సైతం స్ఫూర్తి కలిగించవచ్చని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా మేడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తితో పాటు ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, వాల్య తదితరులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News