Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

Rama Rao August 4, 2026Telangana

నుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంగళవారం శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

టీఆర్‌వీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసయ్య, పరకాల ఏడీఏ అవినాష్ వర్మ రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి, సమతుల్య పోషక యాజమాన్యాన్ని పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ప్రియదర్శిని, ఏఈవోలు అన్వేష్, సానియా, అక్షర, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News