Rama Rao September 2, 2026Telangana
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని పిప్రి(జె) గ్రామంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను నాయకులు స్మరించుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి నిర్ణయాలతో వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాజీవ్ యువశక్తి, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నాయకులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమర్ రహే, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉప సర్పంచ్ రంజిత్, జేమ్స్, రాజేందర్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు రాజేష్, ఎర్రోళ్ల రాజేష్, గుండా నారాయణ, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, రౌతు గంగాసామి, గంగారం రంజిత్, ప్రతాప్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
