Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవాలి

Sowjanya Anneboina September 23, 2026prabhanews.com

రిడేపల్లి,ఆంధ్రప్రభ: డిసెంబర్‌ 1, 2025 నుంచి ఆగస్టు 13, 2026 వరకు కొత్తగా భూమి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఫార్మర్‌ ఐడీ) చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్‌ సూచించారు.

రైతుల సౌకర్యార్థం సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక ఫార్మర్‌ ఐడీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోని అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఫార్మర్‌ ఐడీ నమోదు కోసం రైతులు ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ ఫోన్‌తో సమీపంలోని రైతు వేదికలోని ఏఈఓలను లేదా మీ-సేవ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందించే వివిధ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఫార్మర్‌ ఐడీ నమోదు కీలకమని ఏవో ప్రీతమ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని అర్హులైన ప్రతి రైతు ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకునేలా ఏఈఓలు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

రైతులందరూ సెప్టెంబర్‌ 30లోగా ఫార్మర్‌ ఐడీ నమోదు పూర్తి చేసుకుని ప్రభుత్వ సేవలు, వ్యవసాయ పథకాల ప్రయోజనాలను పొందాలని ఏవో ప్రీతమ్‌కుమార్‌ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News