Bharath August 28, 2026prabhanews.com
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం, విజయాన్ని నింపాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసంతో ముడిపడిన బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, సమృద్ధి, సక్సెస్‌ను తీసుకురావాలని కోరుకున్నారు.
