Bala Raju October 5, 2026breaking news, Gurram Lakshmi Narasimha Reddy, latest telugu news, Red Cross Society, Red Cross Society State Committee, telugu latest news, telugu news
మోత్కూర్, అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ): రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల్లో ప్రస్తుత జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి డైరెక్టర్ గా పోటీ చేయగా.. ఎన్నికల్లో గెలుపొంది రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 2 పర్యాయాలు రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా కొనసాగిన తాను జిల్లా స్థాయిలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవలు, రక్తదానాలు నిర్వహించినట్లు తెలిపారు.
రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో తాను ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియామకం కావడం ఆనందంగా ఉందని, ప్రస్తుత సమాజంలో రక్త కొరత ఉన్నందున తల సేమియా బాధితుల కోసం ప్రతి యువకులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ఆపదలో ఉన్న తోటి వ్యక్తుల ప్రాణాలను కాపాడాలని కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు, మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో దాతల సహకారంతో రెడ్ క్రాస్ భవనం కోసం స్థలం కేటాయింపు జరిగిందని, రెడ్ క్రాస్ నూతన జిల్లా చైర్మన్ సద్ధి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో రెడ్ క్రాస్ నూతన భవన నిర్మాణ పనులు సైతం త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. తమ ఎన్నికకు సహకరించిన రెడ్ క్రాస్ ప్రతి సభ్యునికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
