Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలోని రెండో వార్డులో పీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే.నాగమణి (స్వామి) ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
వార్డు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డు ప్రజలు మాట్లాడుతూ..బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన కౌన్సిలర్ పర్శ కుశలత, అనంత్‌రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.గజానన్, కౌన్సిలర్లు నీలం రవి, నాయకులు సీహెచ్. రాకేష్,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
