Bala Raju October 24, 2026prabhanews.com
ఎల్బీనగర్‌లో ఓపెన్ షెడ్ ప్రారంభోత్సవం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఈ నెల 26న ఊట్కూర్ మండల కేంద్రానికి రానున్నట్లు బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.
భాస్కర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎంపీ నిధులతో నిర్మించిన ఓపెన్ షెడ్‌ను ప్రారంభించేందుకు ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరవుతారని వెల్లడించారు. అనంతరం మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించి, వాటిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల అధ్యక్షులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతు, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొండన్ గోపాల్, మాజీ మండల అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు తారా కృష్ణ, రణవీర్, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
