Bala Raju October 24, 2026prabhanews.com
డీఎల్‌పీఓ ఉదయ్‌కుమార్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నమోదు చేసి, భద్రపరచాలని నారాయణపేట డీఎల్‌పీవో ఉదయ్‌కుమార్ సూచించారు.
శనివారం ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన వివిధ రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అలాగే పట్టణంలోని నాలుగో వార్డులో ఉన్న గ్రామకంఠం భూమికి సంబంధించి గ్రామసభలో తీర్మానం చేసి, కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఆస్తులను పరిరక్షించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పావని, ఎంపీఓ బాలాజీ, సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఉపసర్పంచ్ రమేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
