Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రిమాండ్‌ ఖైదీ బలవన్మరణం..

Pavan Chandragiri September 23, 2026

  • ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి పరారీ..
  • స్వగ్రామంలో ఆత్మహత్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ క్రైం బ్యూరో : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీ కిషోర్‌ కుమార్‌రెడ్డి తన స్వగ్రామానికి చేరుకుని చెరువు గట్టుపై చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్‌ కుమార్‌రెడ్డిపై జులై నెలలో పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు. అయితే జులై 6న మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి కిషోర్‌ కుమార్‌రెడ్డి తప్పించుకుని పరారయ్యాడు. అదే రోజు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కిషోర్‌ కుమార్‌రెడ్డిని మంగళవారం చికిత్స నిమిత్తం జైలు అధికారులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు.

అనంతరం బుధవారం తన స్వగ్రామమైన నందిమల్లకు చేరుకున్న కిషోర్‌ కుమార్‌రెడ్డి.. గ్రామంలోని చెరువు గట్టుపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News