Nagamani Malligari September 2, 2026prabhanews.com
వరుడిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ప్రముఖులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ బాబు (బాబాయ్) తమ్ముడి వివాహ రిసెప్షన్ వేడుకలు మంగళవారం రాత్రి ఉట్నూర్‌లోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ హాజరై వరుడిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ప్రధాన్ పురోహిత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్, ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు చంద్రకాంత్, రాథోడ్ గణేష్ హాజరయ్యారు.
పాత్రికేయులు సుదర్శన్, రహీం, మల్లేష్, అదిల్, అక్బర్, జావిద్, యోగానంద స్వామితో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. వరుడిని ఆశీర్వదించి కానుకలు సమర్పించారు.
