Bala Raju October 5, 2026breaking news, latest telugu news, road accident in Karimnagar, RTC bus, telugu latest news, telugu news
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
కరీంనగర్ క్రైo, ఆంధ్రప్రభ: కరీంనగర్ నగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కోర్టు చౌరస్తాలో ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రమాదం..
కరీంనగర్ 2వ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (నెంబరు: TG 02 T 2003) మంచిర్యాల వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోకి రాగానే, అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టింది.
ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు బస్సు ముందు టైరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు అందులో ఒకరి కాలు నుజ్జునుజ్జయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఘటన సమాచారం అందుకున్న కరీంనగర్ క్రైమ్ పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
